బిగ్ బాస్ సీజన్-5కు టైం ఫిక్స్
- August 26, 2021
హైదరాబాద్: తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5కు ముహూర్తం కుదిరింది.ఈ మేరకు నిర్వాహకులు షో స్ట్రీమింగ్ కోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్-5కు కూడా హోస్ట్‌గా కొనసాగుతారు. “బిగ్ బాస్ 5” సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుందని, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఛానల్ లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని స్టార్ మా ప్రకటించింది. ఇటీవల మేకర్స్ షోకే సంబంధించిన ప్రత్యేక ప్రోమోలను కూడా విడుదల చేశారు.
వారం రోజులలో పార్రంభం కానున్న “బిగ్ బాస్ 5” ప్రతిరోజూ రాత్రి 10 నుండి ప్రసారం అవుతుంది. వారాంతాల్లో మాత్రం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. పోటీదారుల గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. కానీ షో నిర్వాహకులు మాత్రం కంటెస్టెంట్ల ఇంకా పేర్లను గోప్యంగానే ఉంచింది.పోటీదారులను సెప్టెంబర్ 5న కర్టెన్-రైజర్ ఎపిసోడ్ ద్వారా ప్రకటిస్తారు. అప్పటి వరకూ “బిగ్ బాస్-5” కంటెస్టెంట్ల విషయంలో సస్పెన్స్ తప్పదు. అయితే బయట జరుగుతున్న ప్రచారం మేరకు ఇటీవల కాలంలో యూట్యూబ్ లో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్, యాంకర్స్ రవి, వర్షిణి సౌందరరాజన్, ఆర్జే కాజల్, నటి సరయు, హీరోయిన్ ఇషా చావ్లా, డాన్స్ మాస్టర్స్ రఘు, అని, నటరాజ్, విజె లోబో, టీవీ నటుడు, విజె సన్నీ, నటీనటులు శ్వేతవర్మ, మానస్, సిరి హనుమంతు, నవ్యస్వామి, ఆట సందీప్, బాలనటుడు దీపక్ ఈ షోలో పాల్గొనబోతున్నారట.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







