ఎస్బీఐ కస్టమర్లకు అలెర్ట్..
- August 26, 2021
ముంబై: భారత్ లో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తోంది. కరోనా మహహ్మారి కారణంగా వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది.ఇక తాజాగా కస్టమర్లకు బ్యాంకింగ్ అవసరాల నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉంచింది.ఈ నెంబర్ల ద్వారా వివిధ రకాల సేవలు పొందవచ్చు.ఎస్బీఐ టోల్ ఫ్రీ 1800 112 211 లేదా 1800 425 3800 డయల్ చేయడం ద్వారా పలు సమస్యలు పరిష్కరించుకోవచ్చు.అలాగే ఈ సేవలు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డులు, ఇతర బ్యాంకింగ్ విషయాలలో ఈ నెంబర్ల ద్వారా పొందవచ్చు.ఈ మేరకు ఎస్బీఐ ట్వీట్ చేసింది. బ్యాంకు వినియోగదారులు ఇంట్లోనే ఉండి సేవలు పొందవచ్చు. ఇది కాంటాక్ట్ లెస్ బ్యాంకింగ్ సేవలు పొందడానికి ఎస్బీఐ ఈ నెంబర్లను కేటాయించింది.ఈ టోల్‌ఫ్రీ ద్వారా అందించే సేవలు ఏంటంటే..
- బ్యాంకు ఖాతాకు సంబంధించిన బ్యాలెన్స్,మీ చివరి ఐదు లావాదేవీలు.
- ఎస్ఎంఎస్ ద్వారా కూడా బ్యాలెన్స్,చివరి ఐదు లావాదేవీలు పొందవచ్చు.
- ఏటీఎం కార్డును బ్లాక్ చేయడం, తిరిగి కొత్త కార్డు కోసం అభ్యర్థ కోసం ఆ టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవచ్చు.
- ఏటీఎం పిన్ను జనరేట్ చేసుకోవడం.
- మీ పాత ఏటీఎం బ్లాక్ చేసిన తర్వాత తిరిగి కొత్త కార్డును పొందడం.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సదుపాయాలను తీసుకువచ్చింది.ఇంకే మైనా సందేహాలుంటే వినియోగదారులు ఎస్బీఐ https://sbi.co.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







