షార్జా రఫిద్ సెంటర్ వద్ద మహిళలకు ఉచిత కార్ వాష్, వాహన తనిఖీ సౌకర్యం
- August 26, 2021
షార్జా: యూఏఈ మహిళలు తమ వాహనాల్ని ఉచితంగా ఆగస్ట్ 28 నుంచి 31 వరకు షార్జాలోని రఫీద్ సెంటర్ వద్ద వాష్ చేయించుకోవచ్చు, తనిఖీ చేయించుకోవచ్చు. ఎమిరేటీ మహిళల అలాగే వలసదారులైన మహిళలకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది. రఫిద్ ఆటోమేటివ్ సొల్యూషన్స్ (ఆటో ఎక్స్‌ప్రెస్) మెయిన్ సెంటర్ (అల్ అజ్రాలోని షార్జా రింగ్ రోడ్డు వద్ద) ఈ సౌకర్యం పొందవచ్చు. ముందస్తు అపాయింట్‌మెంట్ ఏమీ లేకుండా ముందు వచ్చినవారికి ముందు అవకాశం ప్రాతిపదికన ఈ సౌకర్యం కల్పించనున్నారు నిర్వాహకులు. షార్జా అస్సెస్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన రఫీద్ ఆటోమోటివ్ సొల్యూషన్స్, ఎమిరేటీ విమెన్స్ డే (ఆగస్ట్ 28) సందర్భంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. రఫీద్ ఆటోమోటివ్ సొల్యూషన్స్ సీఈఓ సలీం సయీద్ అల్ మిద్ఫా మాట్లాడుతూ, యూఏఈలో వుంటోన్న ప్రతి మహిళకూ ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







