పులితో ఫోటో దిగాలనుకున్న ప్రముఖ మోడల్...
- August 26, 2021
జర్మనీ: పులితో ఫోటో దిగాలని అనిపించింది ఈ మోడల్ కి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే ప్రయత్నిస్తుంది జెస్సికా. దాంతో కాస్త రిస్క్ చేసి ఆటవీ ప్రాంతం సమీపంలో ఫొటోషూట్ కూడా నిర్వహించింది.ఇక్కడే కథ అడ్డం తిరిగింది. రెండు చిరుత పులులు దాడి చేసి గాయపరిచాయి.జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్ జెస్సికా లీడోల్ఫ్(36)పై పులులు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం. జెస్సికా లీడోల్ఫ్ తూర్పు జర్మనీలోని ఆటవీ ప్రాంతం సమీపంలో సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేటు స్థలంలో ఉన్న రిటైర్‌మెంట్ హోంను సందర్శించింది. చిరుతలు పులులు ఉండే బోనుకు సమీపంలో ఫొటోషూట్ నిర్వహించింది. ఈ క్రమంలో రెండు చిరుతలు జెస్సికా లీడోల్ఫ్‌పై ఒక్కసారిగా దాడి చేసినట్లు సమాచారం. హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు స్థానిక పోలీసులు మీడియాతో పేర్కొన్నారు.
ప్రస్తుతం లీడోల్ఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చిరుతపులులు దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గయాలు అయ్యాయి. దాంతో వైద్యులు సర్జరీ చేశారని పోలీసులు చెప్పినట్లు సదరు మీడియా వెల్లడించింది. అయితే తన తల, చెవులు, చెంపలపై చిరుతలు పదే పదే దాడి చేశాయని జెస్సికా స్థానిక మీడియాతో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సదరు రిటైర్ట్ హోం యజమాని బిర్గిట్ స్టేచ్‌ను పోలీసులు కోరగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







