తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్
- August 28, 2021
హైదరాబాద్: ఆగస్ట్ 28వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ సర్వ సభ్య సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశం అనంతరం రాబోయే రెండు సంవత్సరాలు (2021-23)కి గానూ కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా బాల గోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్. శ్రీధర్, ఎ. ఇన్నారెడ్డి వ్యవహరించబోతున్నారు. కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జె. చంద్రశేఖర్ రావు, కోశాధికారిగా ప్రముఖ ఎగ్జిబిటర్ ఎం. విజయేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా బి.లింగం గౌడ్, పి. సుబ్రమణ్యం, డి. విష్ణు మూర్తి, రవీంద్ర గోపాల్, జి. శ్రీనివాస్, బి. సత్యనారాయణ గౌడ్, జి. శ్రీనివాస్ రెడ్డి, చెట్ల రమేశ్ బి. విజయ్ కుమార్, కె. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎం. నరేందర్ రెడ్డి, ఎం.మోహన్ కుమార్, కె. అశోక్ కుమార్ నియమితులయ్యారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్‌లో టీసీఎస్‌తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









