కరోనా బాధితులకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక్క డోసు చాలట: ICMR
- August 28, 2021
న్యూ ఢిల్లీ: కరోనా బాధితులు కోవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలని.. అది రెండు డోసులతో సమానంగా పని చేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. తాజాగా ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై పలు కీలక విషయాలు బయటపడ్డాయి. కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకుంటే వచ్చే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. వైరస్ బాధితుల్లో ఒక్క డోసుతోనే వస్తున్నాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఈ అధ్యయనంలో కోసం ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య చెన్నైలోని వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ టీకా వేయించుకున్న హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్ల రక్త నమూనాలను సేకరించారు. వారిలో డోసు తీసుకున్న మొదటి రోజు, అలాగే డే 28, డే 56న SARS-CoV-2 నిర్దిష్ట యాంటీబాడీ ప్రతిస్పందనలను ఎలా ఉన్నాయని పరిశీలించారు. కోవాగ్జిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వైరస్ బాధితుల్లో.. అలాగే రెండు డోసులు తీసుకున్న కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకనివారిలోని యాంటీబాడీల ప్రతిస్పందనలు ఒకేలా ఉన్నాయని తెలిపింది. అయితే ఇవి ప్రాధమిక ఫలితాలు మాత్రమేనని.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త లోకేష్ శర్మ వెల్లడించారు. ఒకవేళ ఇది గనక రుజువైతే రాబోయే కాలంలో కోవాగ్జిన్ టీకా సింగిల్ డోసు సిఫార్సు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







