అరబ్ ప్రపంచంలో యూఏఈ పాస్‌పోర్ట్ అత్యంత పవర్‌ఫుల్
- August 30, 2021
యూఏఈ: యూఏఈ పాస్‌పోర్ట్, అరబ్ ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ అని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విభాగంలో యూఏఈకి 15వ స్థానం దక్కింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ వివరాల్ని వెల్లడించింది.ముందస్తు వీసా లేకుండా పాస్‌పోర్ట్ సాయంతో ఎక్కవ దేశాల్లో పర్యటించేందుకు వీలు కల్పించే దేశాలు, వాటి పాస్‌పోర్టుల వివరాల్ని ఈ సంస్థ లెక్కిస్తుంది. టాప్ 20లో అరబ్ దేశాల నుంచి ఎంపికైన ఒకే ఒక్క దేశం యూఏఈ కావడం గమనార్హం. యూఏఈ పాస్‌పోర్ట్ వున్నవారికి ముందస్తు వీసా అవసరం లేకుండా 175 దేశాలకు ప్రయాణించే వీలుంది.యూఏఈ తర్వాతి స్థానాన్ని అరబ్ ప్రపంచంలో ఖతార్ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఖతార్ ర్యాంక్ 59. మొత్తం 199 పాస్‌పోర్టుల్ని, 227 ట్రావెల్ డెస్టినేషన్లని పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాల్ని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







