బిగ్ బాస్ 13 విన్నర్ మృతి
- September 02, 2021
ముంబై: బిగ్ బాస్ 13 హిందీ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న ఉదయం హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు.ఈ విషయం…హిందీ టీవీ, సినిమా సహా.. ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లో హాట్ టాపిక్ అయింది. గత రాత్రి పడుకునేముందు..కొన్ని మెడిసిన్ తీసుకున్నారని… దీంతో… మర్నాడు లేవలేకపోయారని…డాక్టర్లు చెప్పారు.మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉందన్నారు డాక్టర్లు.
సిద్ధార్థ్ శుక్లా వయసు 40 ఏళ్లు. ముంబైలోని తన ఫ్లాట్ లో అచేతనంగా పడి ఉన్న సిద్ధార్థ్ శుక్లాను.. సెప్టెంబర్ 2.. ఉదయం కూపర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. హాస్పిటల్ కు రావడానికి ముందే.. సిద్ధార్థ్ శుక్లా చనిపోయాడని డాక్టర్లు కన్ ఫామ్ చేశారు.పోస్ట్ మార్టమ్ చేసి.. బాడీని కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు డాక్టర్లు.
సిద్ధార్థ్ శుక్లాకు తల్లి, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. మోడలింగ్ తో ఎంటర్ టైన్మెంట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్…టెలివిజన్ షో ‘బాబుల్ కా అంగన్ చూటీ నా’లో లీడ్ రోల్ పోషించాడు. జానే పెహ్చానా సే, యే అజ్నబీ, లవ్ యు జిందగీ, బాలికా వధు లాంటి షోలతో… చాలామంది అభిమానం సంపాదించుకున్నాడు. ఝలక్ దిక్లాజా 6, ఫియర్ ఫ్యాక్టర్- ఖత్రోంకీ ఖిలాడీ 7 తో పాపులారిటీ పెంచుకున్నాడు. బిగ్ బాస్ 13 రియాలిటీ షోలో విన్నర్ గా నిలవడంతో… సిద్ధార్థ్ కెరీర్ కు మరింత ఊపు వచ్చింది.
2014లో బాలీవుడ్ మూవీలో తొలిసారి నటించాడు సిద్ధార్థ్ శుక్లా.కరణ్ జోహార్ నిర్మించిన హంప్టీ కి దుల్హానియాలో సపోర్టింగ్ రోల్ చేశాడు. కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న టైంలో…సిద్ధార్థ్ శుక్లా చనిపోవడం…బాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ అయింది.ఆయన మరణానికి కారణమేంటో అంటూ బాలీవుడ్ చర్చించుకుంటోంది.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







