'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ విడుదల
- September 02, 2021
హైదరాబాద్: మెగా అభిమానులతో పాటు చిత్రసీమ అంత ఎంతగానో ఎదురుచూస్తున్న అసలైన సాంగ్ వచ్చేసింది. వకీల్ సాబ్ మూవీ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్..సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ అంటూ కలెక్షన్ల మోత మోగించేందుకు వస్తున్నాడు. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం.
ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం తో భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సహం నింపారు. ‘సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు తాండాలోన.. బెమ్మాజెముడు చెట్టున్నాది’ అంటూ మొదలైన ఈ పాట భీమ్లా నాయక్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తూ సాగింది. ‘ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ.. ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా.. నిమ్మళంగ కనబడే నిప్పుకొండ.. ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా.. ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క.. చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క’ అంటూ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన పవర్ఫుల్ లిరిక్స్‌తో ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మరోసారి తమన్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చి అభిమానులను కట్టిపడేసాడు.
ఈ గీతాన్ని రామ్ మిరియాల – శ్రీ కృష్ణ – పృథ్వీచంద్ర కలిసి ఆలపించారు. లిరికల్ వీడియో అయినప్పటికీ విజువల్ గా గ్రాండ్ గా చూపించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ సాంగ్ లో థమన్ – శివమణి మరియు మిగతా టీమ్ అందరూ కలిసి పెరఫార్మ్ చేశారు. రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మొత్తం మీద పవన్ బర్త్ డే కనుక అదిరిపోయిందని చెప్పాలి. ఇక మీరు కూడా ఈ సాంగ్ విని ఎంజాయ్ చెయ్యండి.
తాజా వార్తలు
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?







