వ్యాపార సముదాలకు కోవిడ్ 19 కొత్త గైడ్ లైన్స్
- September 04, 2021
సౌదీ: కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు సౌదీ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. సమావేశాలు, వ్యాపార సముదాయాల్లో జనాలను పరిమిత సంఖ్యకు కట్టడి చేసేలా మూడు కొత్త నిబంధనలను మార్గదర్శకాల్లో చేర్చించింది.వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులను లోనికి అనుమతిస్తే ఆ సంస్థ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా పరిగణించనున్నట్లు వెల్లడించింది. అలాగే షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్రాంగణాల్లో వంద మందికి మించి అనుమతించొద్దని స్పష్టం చేసింది. పరిమిత సంఖ్యకు మించి జనాలను అనుమతిస్తే ఆయా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారాలకు జరిమానా విధించనున్నారు. అలాగే ఉల్లంఘన తీవ్రత బట్టి ఆరు నెలల వరకు ఆ సంస్థను మూసివేసేలా అధికారులకు అథారిటీ ఇచ్చినట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







