ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు..
- September 05, 2021
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్, లెక్చరర్ ఇన్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వంటి పోస్టులను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 06 ఖాళీలకు గాను ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్(కాలేజ్ ఆఫ్ నర్సింగ్)–01, లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫెసర్),కాలేజ్ ఆఫ్ నర్సింగ్–05 ఖాళీలను భర్తీ చేయనుంది.
- ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్(కాలేజ్ ఆఫ్ నర్సింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 55 ఏళ్లు మించకూడదు.
- లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 50ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
- అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 నుంచి 2,08,700 జీతంగా చెల్లిస్తారు.
- ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,23,100 నుంచి 2,15,900 వరకూ చెల్లిస్తారు.
- అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు 14-09-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
- పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







