సౌదీయేషన్లో భాగంగా 2021లో స్థానికులకు 213,000 ఉద్యోగాలు
- September 08, 2021
సౌదీ: తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా సౌదీయేషన్ ప్రోగ్రాం చేపట్టిన కింగ్డమ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా వర్కౌట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో సౌదీలకు 213,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి వెల్లడించారు. రిమోట్ వర్క్ ప్లాట్ఫామ్ ద్వారా 52,000 మందికి పైగా పౌరులు ప్రయోజనం పొందుతారని మంత్రి తెలిపారు. సౌదీయేషన్ ద్వారా ఇప్పటివరకు స్థానిక పౌరులకు 1.8 మిలియన్ ఉద్యోగాలను కల్పించినట్లు వివరించింది. ఇక 2024 నాటికి 3,40,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







