కస్టమర్లకు SBI హెచ్చరిక..
- September 08, 2021
భారత్‌లో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కొత్తగా ఏదైనా యాప్ వస్తే దాన్ని ఇన్స్టాల్ చేసుకోమంటూ పదే పదే మీ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తుంటాయి. అయితే పొరపాటున కూడా ఈ 4 యాప్‌లు డౌన్ లోడ్ చేసుకోవద్దంటుంది. ఆ యాప్‌లు ఎనీడెస్క్, క్విక్‌సపోర్ట్, టీమ్ వ్యూయర్, మింగిల్‌వ్యూ యాప్‌లను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని తన వినియోగదార్లకు బ్యాంకు సూచించింది. ఈ నాలుగు యాప్‌లతో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈ యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోమని కొందరు మోసగాళ్లు మాయమాటలు చెప్పి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. వాళ్లు చెప్పిన మాటలు విని ఆ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల గత నాలుగు నెలల్లో 150 మంది ఎస్బీఐ వినియోగదార్లు మొత్తంగా రూ.70 లక్షలు పోగొట్టుకున్నారని ఎస్బీఐ తెలిపింది. ఈ తరహా కేసులు పెరిగిపోతుండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవద్దని ఖాతాదార్లకు ఎస్బీఐ సూచించింది. యూపీఐ ప్లాట్‌ఫాంలను ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. మీకు తెలియని నెంబర్ల నుంచి క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ వస్తే వాటిని తిరస్కరించాలని తెలిపింది. ఎస్బీఐ పేరుతో పలు నకిలీ వెబ్సైట్లు ఉన్నాయని అలాంటి వాటికి జోలికి వెళ్లకూడదని హెచ్చరించింది. ఏ సమస్య పరిష్కారం కోసమైనా తమ అధికారిక వెబ్సైట్ సరైనదే అని నిర్ధారణకు వచ్చిన తరువాతనే మీ వివరాలు తెలియజేయండని ఖాతాదార్లకు ఎస్బీఐ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







