18 దేశాలకు భారతీయులు వెళ్లొచ్చు..
- September 08, 2021
భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం పొడిగించింది. అయితే, 18 దేశాలలో ‘ఎయిర్ బబుల్’ ఏర్పాటు ద్వారా 49 నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించారు. ఎయిర్ బబుల్ సౌకర్యం వల్ల కొన్ని ఆంక్షలతో విమానాలను నడుపుతున్నారు. పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ విమానాలను ఎయిర్ ఇండియా వెబ్సైట్, ఎయిర్ ఇండియా కార్యాలయం ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కోవిడ్-19 పరిస్థితి దృష్ట్యా ఒక్కోసారి విమాన షెడ్యూల్ మార్చవచ్చు.
సెప్టెంబర్ 3న, భారతదేశం బంగ్లాదేశ్‌తో ఎయిర్ బబుల్ ఒప్పందంతో విమానాలను ప్రారంభించింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఇతర దేశీయ విమానయాన సంస్థలు ఢాకాకు విమానాలు నడుపుతున్నాయి.’ఎయిర్ బబుల్’ ఒప్పందం కింద భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ,కువైట్,ఒమన్, బహ్రెయిన్, ఖతార్, బంగ్లాదేశ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెన్యా, మాల్దీవులు,నేపాల్,రష్యా,శ్రీలంక,యూకె,యూ.ఎస్.ఏ దేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది.
మరికొన్ని దేశాలు కూడా భారతదేశానికి ప్రయాణ ఆంక్షలను సడలించాయి.శనివారం ఫిలిప్పీన్స్ దేశం భారతదేశంపై ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న భారతీయులకు టర్కీలో 14 రోజుల క్వారంటైన్ లేదు. అయితే టర్కీకి చేరుకున్న తర్వాత భారతీయ ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష రిపోర్ట్‌ని చూపించాలి.ఇది 72 గంటల కంటే పాతది ఉండకూడదు. అయితే కొన్ని దేశాల నుంచి వచ్చే వ్యక్తులపై భారత ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలను విధించింది.

దీని ప్రకారం యూకె, యూరోపియన్ యూనియన్, పశ్చిమ ఆసియా దేశాల నుంచి వచ్చే వ్యక్తులు RT-PCR పరీక్ష రిపోర్ట్ చూపించడం తప్పనిసరి. అదే సమయంలో భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా వారు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. దేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల సేవలు మార్చి 23, 2020 నుంచి నిలిపివేశారు. అయితే మే 2020 నుంచి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు మాత్రం నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







