కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..10మంది మృతి
- September 09, 2021
యూరప్: యూరప్ నార్త్ మెసిడోనియాలో ఘోర ప్రమాదం జరిగింది. టెటొవా నగరంలోని ఓ కోవిడ్ హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 10మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారితో పాటు ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను కూడా ఇతర ఆస్పత్రులకు తరలించారు.
ఇటీవల కరోనా విజృంభణతో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఆ హాస్పిటల్లో ఓ పేలుడు జరిగిందని..ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని తెలిపారు అధికారులు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







