ఉగాండా లో తెలంగాణ భాషా దినోత్సవం
- September 09, 2021
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా ,ఇండియాలోని డాక్టర్ సినారె వంశీ విజ్ఞాన పీఠం సహకారంతో , తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు 5 ఖండాలలోని తెలుగు సంస్థల అభినందనలతో పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ కాళోజీ నారాయణరావు 107వ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవాన్ని అంతర్జాలంలో ఉగాండా నుంచి నిర్వహిస్తున్నట్లు పార్థసారథి వెల్దుర్తి అధ్యక్షులు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా తెలియచేశారు.
ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో కాళోజీ స్ఫూర్తి ప్రసంగాలలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాలు అందుకున్న
డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ (2015)
గోరటి వెంకన్న ఎం ఎల్ సీ (2016)
డాక్టర్ ఆర్.సీతారాం (2017)
డాక్టర్ అంపశయ్య నవీన్ (2018)
కోట్ల వెంకటేశ్వర రెడ్డి (2019)
ప్రొఫెసర్ రమా చంద్రమౌళి (2020)
డాక్టర్ పెన్నా శివరామకృష్ణ (2021) ప్రసంగిస్తారు.
డాక్టర్ కె . వి. రమణ , తెలంగాణ ప్రభుత్వ సలహాదారు
బి.వేణుగోపాలరావు గారు చైర్మన్ , డాట్ సర్వీసెస్ లిమిటెడ్ ( ఉగాండా , టాంజానియా , కాంగో , సూడాన్ , జాంబియా మరియు ఇండియా )
వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా,కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, ఫౌండర్ వంశీ గ్రూప్స్, డాక్టర్ జె. చెన్నయ్య , సెక్రటరీ తెలంగాణ సారస్వత పరిషత్ ,
కాళోజీ రవికుమార్, కాళోజీ సంతోష్ (అమెరికా) , నాగిళ్ళ రామశాస్త్రి , ప్రెసిడెంట్ కాళోజీ ఫౌండేషన్ , వి. ఆర్ . విద్యార్థి సెక్రటరీ కాళోజీ ఫౌండేషన్, డాక్టర్ వ్యాసకృష్ణ బూరుగుపల్లి , ఆఫ్రికా పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలనించి ట్రైనెట్ లైవ్లో చూడవచ్చని పార్థసారథి తెలియచేశారు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







