'భవదీయుడు భగత్‌సింగ్' గా పవన్… ఫస్ట్ లుక్ విడుదల!
- September 09, 2021
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. వరుస సినిమాలతో వారానికి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు కిక్కెస్తున్నాడు పవన్. తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఫస్ట్‌లుక్‌ని గురువారం షేర్ చేసింది చిత్ర యూనిట్. ట్విట్టర్ వేదికగా పోస్టర్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేస్తూ ట్వీట్ చేశారు. 'భవదీయుడు భగత్‌సింగ్' అనే టైటిల్‌ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సామాజిక కోణంలో బలమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హరీశ్-పవన్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో సినీ అభిమానులకు తెలిసిన విషయమే. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మరి పవన్‌కి జోడీగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం, తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







