మెడికవర్ హాస్పిటల్స్ లో యువ ఆర్థోపెడిక్ సర్జన్లకు శిక్షణా తరగతులు
- September 18, 2021
**వర్చ్యువల్ విధానంలో లైవ్ సర్జరీలు, పాల్గొన్న 150 మంది యువ వైద్యులు. **
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్ లో యువ ఆర్థోపెడిక్ వైద్యులకు విర్చువల్ విధానం ద్వారా శిక్షణా తరగతులను నిర్వహించారు. లైవ్ సర్జరీని ప్రదర్శించారు. సర్జరీ సమయంలో ఎలాంటి మెలుకువలు పాటించాలి, ఏ రకమైన ఇంప్లాంట్స్ వాడాలి, సర్జరీ తరువాత పేషేంట్ కు ఎలాంటి మందులు సూచించాలి అనే విషయాలను సమగ్రంగా చర్చించి సందేహాలను నివృత్తి చేశారు. ఆర్థోపెడిక్స్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్.కృష్ణ కిరణ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం రూపు దిద్దికుంది.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ "నాణ్యమైన వైద్య సేవలను ప్రతిబింబించే విధంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది , యువ డాక్టర్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేసాం. ఎలాంటి ఇంప్లాంట్స్ వాడాలి , ఎక్కువ కలం మన్నే నాణ్యతగల ఇంప్లాంట్స్ ని ఎలా కనుగొనాలి అనే విషయాలను పూర్తి స్థాయిలో చర్చించాం ".డాక్టర్ మాట్లాడుతూ చాలా హాస్పిటల్స్ లో మెరుగైన వైద్య సదుపాయాలున్నా అనుభవజ్ఞులైన డాక్టర్స్ లేకపోవడం , లేక అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నా సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం జరుగుతున్నది. మారుతున్న కాలంలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు రావడం వలన రిప్లేసెమెంట్స్ చేయడం మరియు హిప్ రిప్లేసెమెంట్స్ సర్జరీస్ చేయడం జరుగుతున్నది. ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ని చాలా జాగ్రత్తగా చేయాలి . అలా చేయకపోవడం వల్ల అవి పునరావుతమవుతాయి అని అన్నారు . ఈ ఒక్క లైవ్ సర్జరీ ద్వారా మనం హిప్ ఆర్థోప్లాస్టి ని ఎలా చేయాలి అని చెప్పడం మరియు లైవ్ ప్రాక్టికల్ గా చేసి చూపించడం జరిగింది.
డాక్టర్ చంద్రశేఖర్ దానన మాట్లాడుతూ ఇలాంటివి లైవ్ సర్జరీస్ యువ ఆర్థోపెడిక్ సర్జన్స్ కి ఎంతో ఉపయోగం.ఇప్పటినుంచి ఇవి ఎలాచేయాలి అని తెలుసుకోవడం వలన రాబోయే రోజుల్లో వాళ్ళు ఇటువంటివి మరియు ఎంత క్లిష్టమైన సర్జరీస్ ని కూడా హ్యాండిల్ చేయగలుగుతారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా మనం పేషెంట్స్ కి ఎటువంటి మెరుగైన సేవలను అందిచగలం మరియు వారికీ ఎక్కువ కాలం మన్నిక గల వైద్యాన్ని అందించడమే లక్ష్యం .
శిక్షణ తరగతులకు హాజరైన యువ డాక్టర్ మాట్లాడుతూ "బహుశా ఈ తరహా శిక్షణ ఇదే మొదటి సారి అయి ఉండొచ్చు, ఎంతో అనుభవం గడించిన సీనియర్ వైద్యులు మాకు శిక్షణను అందించి , మా సందేహాలను నివృత్తి చేశారు. చాల విషయాలను నేర్చుకున్నాం. ఎంతో సంతోషంగా ఉంది అన్నారు". అత్యాధునిక పద్ధతులు ద్వారా హిప్ రీప్లేస్మెంట్ & ఆర్థోప్లాస్టి లైవ్ సర్జరీ ని నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్స్ కి ధన్యవాదములు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్‌లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్‌పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







