ఈ స్టోర్స్ ప్రోడక్ట్ లను వాపస్ ఇవ్వొచ్చు..బహ్రెయిన్ స్పష్టత
- September 19, 2021
మనామా: ఒక వస్తువుకు బిల్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్లీ రిటర్న్ తీసుకోబోమంటూ బిల్లింగ్ పై మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఈ స్టోర్స్ నుంచి కొన్న వస్తువులకు సంబంధించిన బిల్లులపై కూడా ఇలాంటి షరతులు మనకు కన్పిస్తుంటాయి. అయితే..ఇది వినియోగదారుల హక్కులకు భంగం కలిగించటమేనని, చట్టవిరుద్ధమని వినియోగదారుల హక్కుల చట్టం చెబుతోంది. ఏ వస్తువునైనా ఈ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేసినట్లైతే...అది నచ్చకున్నా, డ్యామేజ్ అయినా, మీరు ఆర్డర్ ఇచ్చిన వస్తువు మీ అంచనాలకు తగినట్లుగా లేకున్నా 15 రోజుల్లో వాపస్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ హక్కును ఏ కంపెనీలు తిరస్కరించేవు. అంతేకాదు వినియోగదారుల హక్కు చట్టం ప్రకారం ఒక వస్తువును ఈ స్టోర్ నుంచి కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల్లో రిటర్న్ ఇస్తే..ఆ వస్తువు రిప్లేస్ చేయాల్సిన బాధ్యత కూడా సదరు కంపెనీలకు ఉంటుందని వినియోగదారుల హక్కుల విభాగం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







