మహిళను వేధించిన కేసులో వలసదారుడి అరెస్ట్
- September 26, 2021
జెడ్డా: మక్కా పోలీస్, ఓ ఈజిప్టు జాతీయుడ్ని అరెస్టు చేశారు. ఓ మహిళను నిందితుడు వేధించినట్లుగా పోలీసులు వెల్లడించారు. మక్కా రీజియన్ పోలీస్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, నిందితుడు తాను చేసిన దుశ్చర్యను మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడని తెలిపారు. ఆ వీడియో ఆధారంగా అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ తరహా కేసుల్లో దోషులకు 100,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా పడే అవకాశం వుంది. రెండేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడొచ్చు. పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే, అలాంటి కేసుల్లో అత్యధికంగా ఐదేళ్ళ జైలు శిక్ష, అత్యధికంగా 300,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







