ప్రైమ్‌వీడియోస్‌లో ఎక్స్ట్రా లెవెల్ మస్తీ
- September 26, 2021
అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్న ప్రత్యేక సర్వీసుని అమెజాన్ ఇండియాలో కూడా ప్రవేశపెట్టింది. ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫార్మ్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సర్వీసు గత శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీ బూమ్
గత రెండేళ్లుగా ఇండియాలో ఓటీటీ బిజినెస్ ఊపందుకుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌వీడియోస్, హాట్‌స్టార్‌లకు తోడుగా అనేక సినిమా నిర్మాణ సంస్థలు, టీవీ ఛానల్లు సొంతంగా ఓటీటీలు నెలకొల్పాయి. పోటాపోటీగా ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. దీంతో నచ్చిన వీడియో కంటెంట్ చూడాలంటే అనేక ఓటీటీ యాప్‌లకు చందాదారులగా చేరాల్సి వస్తోంది.
ఓకే ప్లాట్‌ఫామ్
ప్రైమ్ వీడియో వేదికగా ఇతర యాప్‌లను బండిల్ ఆఫర్‌గా అమెజాన్ అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తగా ఇప్పటికే 9 దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా ఇండియాలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
లాగిన్ సమస్యలుండవు
వ్యక్తిగతంగా ఉపయోగించే ఈ మెయిల్ ఐడీల నుంచి పలు సోషల్ మీడియా అకౌంట్లు, ఫైనాన్షియల్ యాప్‌లు అన్నింటికీ వేర్వేరు యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు ఉంటున్నాయి. వీటికి తోడు పదుల సంఖ్యలో ఓటీటీ యాప్‌లు కూడా వచ్చి చేరాయి. ఈ పాస్‌వర్డ్‌లు, యూజర్ నేమ్‌ల గోల తప్పించేందుకు బండిల్ ఆఫర్‌ని అందిస్తున్నట్టు ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ గౌరవ్ గాంధీ తెలిపారు.
బండిల్ ఆఫర్‌లో ఉన్నవి ఇవే
అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో బండిల్ ఆఫర్‌గా ముబీ, డోకుబే, డిస్కవరీ ప్లస్, లయన్స్‌గేట్ ప్లే, ఈరోస్ నౌ, షార్ట్స్ ప్లే, హోయ్‌చోయ్, మనోరమా మ్యాక్స్ వంటి ఇతర ఓటీటీ సేవలు ఉన్నాయి. అయితే ఈ సేవలను యాడ్ ఆన్ సబ్‌స్క్కిప్షన్ పద్దతిలో అందించారు. దీని ప్రకారం ఈ అదనపు వీడియో కంటెంట్ చూడాలంటే వేర్వేరుగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బండిల్ ఆఫర్‌లో భాగంగా వన్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్‌పై తగ్గింపును అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







