క్రికెట్ మరియు సంగీతం ఉత్తమ కలయిక - సయ్యద్ రఫీ
- September 27, 2021
దోహా: దోహాలో ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు క్రిక్ కతర్ వారు హిందీలో “ఆ గయా క్రిక్ ఖతార్..ఆ గయా” పేరుతో మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌ను విడుదల చేసింది. దోహాకు చెందిన గాయకుడు మొహిందర్ జలంధరి ఈ పాటను పాడగా, అద్నాన్ ర్యాప్ చేయటం జరిగింది. దోహా స్థానిక ప్రవాస క్రికెట్ ప్లేయర్‌లు ఈ వీడియో ఆల్బమ్‌లో క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు.

CRIC QATAR లో 430 కి పైగా క్రికెట్ జట్లు నమోదు చేయబడ్డాయి. ఈ జట్టులు ప్రతి వారం ఉచితంగా మ్యాచ్‌లు ఆడతాయి. "క్రికెట్ ని మ్యూజిక్ తో ప్రమోట్ చెయ్యటం, ఖతార్‌లో క్రికెట్‌ను ప్రోత్సహించడం మరియు ఖతార్ ఆటగాళ్లను హైలైట్ చెయ్యడం క్రిక్ కతర్ ఉద్దేశం" అని చైర్మన్ సయ్యద్ రఫీ అన్నారు. విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది. క్రీడలు ప్రజలను ఏకీకృతం చేయగలవని నేను గ్రహించాను. వాస్తవానికి, క్రీడలు మరియు సంగీతం కలిస్తే ఉత్తమంగా ఉంటుంది. దాన్ని ఆచరణలో పెట్టె ప్రయత్నమే ఈ క్రిక్ కతర్ అని రఫీ చెప్పారు.
క్రికెట్ అభిమానించే ఎందరో ప్రవాసీయులను ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా HIQ క్రికెట్ క్లబ్ వైస్ కెప్టెన్ మహ్మద్ ఆతిఫ్ మాట్లాడుతూ "ఈ మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లో తనను తాను చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సయ్యద్ రఫీకి నా కృతజ్ఞతలు" అని తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







