తాలిబన్ల కొత్త రూల్..
- September 27, 2021
కాబూల్: తాము మారిపోయామంటూనే తమ పాత పద్ధతిలోనే పాలనను కొనసాగిస్తున్నారు తాలిబన్లు.. తమ నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా మరో అవసరంపై కూడా వారు నిషేదం విధిస్తున్నట్లుగా ప్రకటించారు. దక్షిణ అఫ్గనిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైలిష్ హెయిర్‌స్టైల్స్, క్లీన్ షేవ్‌ను చేసుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినట్లుగా వెల్లడించారు. లష్కర్ గాహ్‌లో పురుషుల సెలూన్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో స్టైలిష్‌గా హెయిర్ కట్టింగ్, గడ్డం షేవింగ్ చేయకూడదని వారు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షించబడుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా షాపులలో ఆద్యాత్మిక పాటలు తప్ప మరే పాటలు కూడా వినిపించకూడదని హకుం జారీ చేశారు. 1996 నుండి 2001 వరకు తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఆడంబరమైన కేశాలంకరణను నిషేధించారు. పురుషులు గడ్డాలు పెంచాలని ఆదేశించారు. చూస్తుంటే తాలిబన్లు మళ్ళీ పాత ధోరణిలోనే వారి పాలనను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







