టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- September 27, 2021
SSC Jobs 2021: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో 3261 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబర్ 25. దరఖాస్తు అనంతరం ఫీజు చెల్లించేందుకు అక్టోర్ 28 రాత్రి 11.30 వరకు అవకాశం ఉంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. 2022లో జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత పరీక్ష తేదీలు విడుదల చేస్తారు. అభ్యర్దులు పూర్తి వివరాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
పోస్టులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్, గర్ల్స్ కేడెట్ ఇన్‌స్ట్రక్టర్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్‌టైల్ డిజైన్ తదితర పోస్టులు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ-పరీక్ష విధానం: ప్రాథమికంగా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయంల 60 నిమిషాలు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. పోస్టును బట్టి విద్యార్హతలు ఉంటాయి.. ఆ ప్రకారంగా పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి పరీక్ష జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని స్కిల్ టెస్ట్‌కు పిలుస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







