పాక్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్ కు గుండెపోటు
- September 28, 2021
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ను లాహోర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం సాయంత్రం పూట ఇంజమామ్ కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ ను ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు.
ఆస్పత్రిలో చేరిన ఇంజమామ్ కు.. తాజాగా యాంజియోప్లాస్టి సర్జరీ చేశారు వైద్యులు.
ప్రస్తుతం ఇంజమామ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు వైద్యులు. వైద్యుల ప్రకటనతో… ఊపిరిపీల్చుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ విషయం తెలిసిన పాకిస్తాన్ క్రికెట్ సభ్యులు… విచారం వ్యక్తం చేశారు. ఇంజమామ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు ఆటగాళ్లు. కాగా… ఇప్పటి వరకు ఇంజామామ్.. పాక్ తరఫున 375 మ్యాచ్ లు ఆడి 11701 పరుగులు చేశారు. అలాగే…పాక్ కు విజయవంతమైన కెప్టెన్ గా ఎదగడమే కాకుండా… బ్యాటింగ్ లోనూ మంచి రికార్డు సంపాదించాడు. 2007 లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు ఇంజామామ్.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







