ఇండియన్‌ పోస్టల్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు..

- October 03, 2021 , by Maagulf
ఇండియన్‌ పోస్టల్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ పోస్టల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను స్పోర్ట్స్‌ కోటా ద్వారా తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

  • నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 221 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • వీటిలో పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్ అసిస్టెంట్‌ (72), పోస్టుమ్యాన్‌ (90), మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (59) ఖాళీలు ఉన్నాయి.
  • పోస్టల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100వరకు జీతంగా చెల్లిస్తారు.
  • పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవారు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ 59,100 జీతంగా చెల్లిస్తారు.
  • మల్టీ టాస్కింగ్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికై వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

  • ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఏడీ (రిక్రూట్‌మెంట్‌), సీపీఎంజీ, ఢిల్లీ సర్కిల్‌, మేఘదూత్‌ భవన్‌, న్యూఢిలీ – 110001 అడ్రస్‌కు పంపించాలి.
  • అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు
  • దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి (04-10-202) ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 12-10-2021గా నిర్ణయించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com