సౌదీ వెలుపల వుంటే, ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాలు ఫైనల్ ఎగ్జిట్ వీసాలుగా మారవు
- October 04, 2021
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజాత్), వ్యక్తిగత అవసరాల కోసం సొంతంగా పని వెతుక్కునే క్రమంలో అక్రమంగా వెళ్ళే వలసదారులకు 50,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వలసదారుడు జైలు శిక్ష పూర్తి చేసుకున్నాక, జరీమానా పూర్తిగా చెల్లించాక దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. కంపెనీలు, వర్కర్లకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఈ హెచ్చరికల్ని జవజాత్ చేయడం జరిగింది. ఎగ్జిట్ మరియు ఎంట్రీ వీసా చెల్లుబాటు గడువు ముగిశాక ఆరు నెలల తర్వాత అబ్షెర్ సిస్టంలోంచి డొమెస్టిక్ వర్కర్స్ తొలగించబడతారు. అలా జరగకూడదంటే తవాసుల్ ద్వారా కమ్యూనికేట్ చేయాల్సి వుంటుంది వీసా గడువు తీరిన 30 రోజుల్లోగా. దేశం వెలుపల సదరు వ్యక్తులు వుంటే, ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాలు ఫైనల్ ఎగ్జిట్ వీసాలుగా మారబోవు. ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసా ద్వారా సౌదీ విడిచి వెళ్ళి, గడువు తీరే లోపు సౌదీకి చేరకపోతే, అలాంటివారిపై మూడేళ్ళ నిషేధం వుంటుంది. అంతకు ముందు ఎంప్లాయర్ ద్వారా కొత్త వీసా పొందితే వారికి వెసులుబాటు వుంటుంది.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







