సౌదీ వెలుపల వుంటే, ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాలు ఫైనల్ ఎగ్జిట్ వీసాలుగా మారవు

- October 04, 2021 , by Maagulf
సౌదీ వెలుపల వుంటే, ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాలు ఫైనల్ ఎగ్జిట్ వీసాలుగా మారవు

రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజాత్), వ్యక్తిగత అవసరాల కోసం సొంతంగా పని వెతుక్కునే క్రమంలో అక్రమంగా వెళ్ళే వలసదారులకు 50,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వలసదారుడు జైలు శిక్ష పూర్తి చేసుకున్నాక, జరీమానా పూర్తిగా చెల్లించాక దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. కంపెనీలు, వర్కర్లకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఈ హెచ్చరికల్ని జవజాత్ చేయడం జరిగింది. ఎగ్జిట్ మరియు ఎంట్రీ వీసా చెల్లుబాటు గడువు ముగిశాక ఆరు నెలల తర్వాత అబ్షెర్ సిస్టంలోంచి డొమెస్టిక్ వర్కర్స్ తొలగించబడతారు. అలా జరగకూడదంటే తవాసుల్ ద్వారా కమ్యూనికేట్ చేయాల్సి వుంటుంది వీసా గడువు తీరిన 30 రోజుల్లోగా. దేశం వెలుపల సదరు వ్యక్తులు వుంటే, ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాలు ఫైనల్ ఎగ్జిట్ వీసాలుగా మారబోవు. ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసా ద్వారా సౌదీ విడిచి వెళ్ళి, గడువు తీరే లోపు సౌదీకి చేరకపోతే, అలాంటివారిపై మూడేళ్ళ నిషేధం వుంటుంది. అంతకు ముందు ఎంప్లాయర్ ద్వారా కొత్త వీసా పొందితే వారికి వెసులుబాటు వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com