వంతెన కింద ఇరుక్కుపోయిన ఎయిర్ ఇండియా విమానం

- October 04, 2021 , by Maagulf
వంతెన కింద ఇరుక్కుపోయిన ఎయిర్ ఇండియా విమానం

న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన రెక్కలు లేని విమానం ఒకటి వంతెన కింద ఇరుక్కుపోయింది. ఢిల్లీ గుర్గావ్ హైవేపై ఈ ఘటన జరిగింది. రోడ్డుకు ఒక పక్కగా వాహనాలు వెళ్తుండగా మరోవైపు వంతెన కింద ఇరుక్కున్న విమానం కనిపించింది. ప్రస్తుతం ఈ విమానం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియో ఎయిర్ ఇండియా అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై స్పందించారు.

తాము అమ్మేసిన పాత విమానం కొన్న వ్యక్తి తరలిస్తుండగా వంతెన కింద స్ట్రక్‌ అయినట్లు చెప్పారు. ఈ ఘటనతో ఎయిర్‌ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. స్థానిక అధికారులు శ్రమించి విమానాన్ని వంతెన కింద నుంచి బయటకు తెచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com