ఒమాని ఉమెన్స్ డే.. ఒమన్ సెల్యూట్ డాటర్స్

- October 17, 2021 , by Maagulf
ఒమాని ఉమెన్స్ డే.. ఒమన్ సెల్యూట్ డాటర్స్

ఒమన్: ఒమాని ఉమెన్స్ డే సందర్భంగా డాటర్స్ కు సెల్యూట్ అంటూ ఒమన్ గవర్నమెంట్ శుభా కాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ ఫాతిమా అల్ మంతెరియాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. మస్కట్ నుండి నార్త్ అల్ బటినా వైపు వెళ్లే నాలుగు హెలికాప్టర్‌లలో ఒకదానికి ఆమె పైలట్గా వ్యవహరించారు.  
ఒమాని ఉమెన్స్ డే సందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ ఫాతిమా అల్ మంతెరియా మహిళలకు శుభా కాంక్షలు తెలిపింది. అలాగే పైలట్ గా తన అనుభవాలను పంచుకుంది. అక్టోబర్ 4 న మస్కట్ నుండి ఉదయం 4 గంటలకు బయలుదేరాము. షహీన్ ఉత్తర, దక్షిణ అల్ బటినా గవర్నర్లను దాటే వరకు వాతావరణం బాగానే ఉంది, కానీ మేము బర్కా దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. ల్యాండ్అయ్యే నిర్దేశిత ప్రాంతానికి చేరే కొద్ది వర్షం చాలా తీవ్రంగా మారింది. చివరికి నాలుగు హెలికాప్టర్లు అల్ సువైక్ అండ్అల్ కాబౌరాలోని నిర్దేశిత ప్రాంతంలో క్షేమంగా ల్యాండ్ కావడంతో అందరం ఊపిరిపీల్చుకున్నాం.. అంటూ స్క్వాడ్రన్ లీడర్ ఫాతిమా తన అనుభవాలను వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com