దుబాయ్: సెల్ఫ్ డ్రైవింగ్ డెలివరీ వాహనాలు త్వరలో రోడ్లపైకి..
- October 18, 2021
దుబాయ్: చైనాకి చెందిన సంస్థ నియోలిక్స్, సెల్ప్ డ్రైవింగ్ వాహనాల్ని నూన్ కామ్ (ఆన్ లైన్ మార్కెటింగ్ ప్లేస్) సంస్థతో కలిసి తీసుకురాబోతోంది. ఈ వాహనాలు పార్సిళ్ళను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. ఈ వాహనాలకు ఓ స్క్రీన్ వుంటుంది, దానిపై ప్రత్యక్షమయ్యే క్యూఆర్ కోడ్ ద్వారా వస్తువుల డెలివరీ సజావుగా సాగుతుంది. పూర్తిస్థాయి ఆటోమేటెడ్ వ్యవస్థతో ఈ వాహనాలు పనిచేస్తాయి. వచ్చే నెల మొదటి వారంలో ఈ వాహనాలు తమ కార్యకలాపాల్ని ప్రారంభించే అవకాశం వుంది. ఈ వాహనం తనంతట తాను అమ్మకం సాగించేలా కూడా ఉపయోగపడుతుంది. కొన్ని వస్తువుల్ని ఈ వాహనం దగ్గర వినియోగదారులు కొనుగోలు చేయవొచ్చు. ప్రధాన రహదారికి దూరంగా వుండే కమ్యూనిటీస్‌కి ఈ వాహనాలు ఉపయోగపడతాయి.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







