ప్రపంచ కుబేరుని కుమార్తె పెళ్లి ఖర్చు అంతేనా!!
- October 19, 2021
ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ కుమార్తె పెళ్లి ఇటీవలే జరిగింది. సామాన్యుల ఇంట పెళ్లే అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పుడు బిల్‌గేట్స్ ఇంట పెళ్లి అంటే చాలా ఊహించుకుంటాం కదా. ఇంతకీ ఆ పెళ్లికి ఎంత ఖర్చయిందో తెలుసుకుందాం.
ప్రస్తుతం పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుక ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఆ పెళ్లికైన ఖర్చు అక్షరాలా 2 వందల కోట్ల రూపాయలని సమాచారం. మరి ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఇంట పెళ్లి అంటే ఇంకా వైభవంగా ఉంటుంది కదా. బిల్‌గేట్స్ కుమార్తె పెళ్లి ఖర్చు చాలా ఎక్కువే ఉంటుందని భావిస్తారు. కానీ అలా లేదు. బిల్‌గేట్స్ కుమార్తె వివాహానికైన ఖర్చు కేవలం 14 కోట్లు మాత్రమే. అంటే ఇషా అంబానీ పెళ్లికైన ఖర్చులో పదిశాతం కూడా లేదు. ఇంత తక్కువ ఖర్చులో చేయడానికి కారణాలు రెండున్నాయి.
మొదటి కారణం కరోనా. రెండవది బిల్‌గేట్స్ దంపతుల విడాకుల వ్యవహారం. బిల్‌గేట్స్ కుమార్తె జెన్నిఫర్..తన స్నేహితుడు, ప్రియుడైన నాయెల్ నాజర్‌తో జరిగింది. వోగ్ మేగజైన్‌కు స్వయంగా జెన్నిఫర్ గేట్స్ తన వివాహ సంగతుల్ని పంచుకుంది. 2021 తనకు చాలా సవాళ్లు విసిరిన సంవత్సరమని జెన్నిఫర్ తెలిపింది. ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయిందని..మరోవైపు తన తల్లిదండ్రులు విడాకుల తీసుకున్న దురదృష్టకర సంఘటన జరగడం ఊహించలేదని పేర్కొంది. ఈ పరిస్థితుల మధ్య పెళ్లి వేడుకను ప్లాన్ చేయడం చాలా సవాలుతో కూడుకుందని జెన్నిఫర్ స్పష్టం చేసింది. పెళ్లికి రెండు కుటుంబాల సన్నిహితుల్ని మాత్రమే పిలవాలనుకున్నా..3 వందలమంది జాబితా సిద్ధమైందని జెన్నిఫర్ చెప్పింది. పెళ్లికి వ్యాక్సినేషన్, నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా చేశామని, మతపరమైన, సివిల్ రెండు వేడుకలు నిర్వహించామని జెన్నిఫర్ తెలిపింది.
న్యూయార్క్‌లో ఉత్తర సేలంలోని 142 ఎకరాల ప్రైవేట్ ఎస్టేట్‌లో బహిరంగ వేడుక జరిగిందని..ప్రఖ్యాత న్యూయార్క్ సిటీ రెస్టారెంట్లు క్యాటరింగ్ చేశాయని జెన్నిఫర్ వివరించింది. ఈజిప్టు సంతతికి చెందిన నాజర్‌ది సంపన్న కుటుంబమే. ఇద్దరూ స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. బిల్‌గేట్స్ దంపతులు విడిపోవడంతో అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా చూసుకున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







