రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
- October 19, 2021
అమరావతి: ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య అగ్గి రాజుతోంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. దీంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ. టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యాలపై ఆవేశాలకు గురికావొద్దని, అందరు కూడా సంయమనం పాటించాలని ఏపీ డీజీపీ కార్యాలయం హెచ్చరించింది. రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.
విజయవాడలోని పట్టాభి ఇంట్లోకి ప్రవేశించిన కార్యకర్తలు సామగ్రి ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై పట్టాభి ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం అనంతరం సీఎం పై వ్యాఖ్యలకు నిరసనగా.. వైఎస్ఆర్ సీపీకి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అయింది.
రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి చేశారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లను కూడా ముట్టడించారు. కాగా.. కేంద్ర కార్యాలయంపై దాడి అనంతరం.. అక్కడికి చేరుకొని టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. ఘటనకు సంబంధించి పార్టీ శ్రేణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, అశోక్‌బాబు, పట్టాభి తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దాడికి నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







