టీమిండియాకు రెండో ఓటమి
- October 31, 2021
దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-2లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది.సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
టీమిండియా విధించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.3 ఓవర్లలో కివీస్ చేధించింది. ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ (49), కెప్టెన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించి తమ జట్టుకు విజయం అందించారు.భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో హార్డిక్ పాండ్యా రెండు ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైన టీమిండియా వరల్డ్ కప్‌లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







