హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాన్పూర్‌కు విమాన సర్వీసు
- November 01, 2021
హైదరాబాద్: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) నుండి ఈ రోజు "ది లెదర్ సిటీ ఆఫ్ ది వరల్డ్" అయిన కాన్పూర్‌కు నూతన విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇండిగో ప్రారంభ విమానం హైదరాబాద్ నుండి కాన్పూర్‌కు మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా ఇండిగో, GHIAL సీనియర్ అధికారులు ప్రయాణీకులు, సిబ్బందికి వీడ్కోలు పలికారు.
ఇండిగో ఫ్లైట్ 6E 269 ప్రతిరోజూ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి కాన్పూర్ నుండి ఇండిగో ఫ్లైట్ 6E 102 సాయంత్రం 4.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్- కాన్పూర్ మధ్య వారానికి ఆరు సార్లు సోమవారం నుండి శనివారం వరకు – విమాన సర్వీసు ఉంటుంది.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ధైర్యంగా ప్రయాణం చేస్తున్నారు. కఠినమైన కోవిడ్ నిబంధనల కారణంగా విమాన ప్రయాణానికి డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. విమానాశ్రయాలు రద్దీగా మారుతుండగా, విమానయాన సంస్థలు పాత సర్వీసులను పునరుద్ధరిస్తూ కొత్త గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభమౌతున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ 100 కోట్లకు చేరుకోవడంతో విమాన ప్రయాణంపై విశ్వాసం పెరుగుతోంది.
GHIAL CEO ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “కోవిడ్ తర్వాత హైదరాబాద్ నుండి కొత్త గమ్యస్థానాలకు డిమాండ్ పెరుగుతుండగా, నిరంతరం ఆ డిమాండ్ తీర్చడానికి ప్రయత్నిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న టైర్-2 నగరాలను అనుసంధానించడంపై మేం దృష్టిని కేంద్రీకరించాం. క్రమంగా పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్య, పలు సర్వీసుల పునఃప్రారంభం భారతీయ విమానయాన పరిశ్రమ తిరిగి పుంజుకుంటోందని సూచిస్తున్నాయి. విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాం.’’ అన్నారు.
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ అనంతరం కాలంలో మెట్రో విమానాశ్రయాలలో అత్యధిక ప్యాసింజర్ రికవరీ ఇక్కడే జరిగింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ సెక్టార్లకు విమానాల సంఖ్య పెరిగింది. విమానాశ్రయం నుంచి సెప్టెంబరులో విమానాల రాకపోకలు పెరిగి 9 వేల దగ్గరకు చేరాయి. అక్టోబర్ 17న, GHIAL అత్యధిక దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య కలిసి 50 వేలు దాటింది, ఇది కోవిడ్ ముందు సంఖ్యలో 81%.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







