అబుధాబిలో కొత్త ట్రాఫిక్ రూల్..
- November 06, 2021
అబుధాబి: అబుధాబిలో వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. భారీ శబ్ధం చేసే వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా విధిస్తామని వెల్లడించారు. ధ్వని కాలుష్యం విపరీతంగా పెరగడంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా యువత గట్టి శబ్ధాలతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని తద్వారా ప్రజా జీవనానికి, శాంతికి భంగం కలుగుతుందని తెలిపారు. కనుక ఇకపై నివాస ప్రాంతాల్లో భారీ ధ్వనులతో వాహనాలు నడిపితే 999 నెంబర్‌కు కాల్ చేసి చెప్పాలని సూచించారు.
ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 20 ప్రకారం ఇలా భారీ శబ్ధాలతో వాహనం నడిపేవారికి 2వేల దిర్హమ్స్ జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. అలాగే అలాంటి వాననం నడిపినందుకు వాహనదారుడి ఖాతాలో 12 బ్లాక్ పాయింట్లు వేస్తారు. వాహనం ఇంజిన్‌ను అనధికారికంగా మార్పులు చేసి ధ్వని కాలుష్యానికి పాల్పడితే ఆర్టికల్ 73 ప్రకారం వెయ్యి దిర్హమ్స్ ఫైన్, 12 ట్రాఫిక్ పాయింట్లు పడతాయన్నారు. అలాగే వాహనాన్ని 30 రోజులు జప్తు చేయడం జరుగుతుంది. వాహనం జప్తు చేసిన తర్వాత మూడు నెలలలోపు 10వేల దిర్హమ్స్ జరిమానా చెల్లించి వాహనాన్ని విడిపించుకోవాలి. లేనిపక్షంలో వాహనాన్ని వేలం వేయడం జరుగుతుందని ట్రాఫిక్ అధికారులు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







