ఇరాక్ ప్రధానిపై హత్యాయత్నం..
- November 07, 2021
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమిపై హత్యాయత్నం జరిగింది. దాడి విఫలమవడంతో క్షేమంగా బయటపడ్డారు ప్రధాని. దాడిలో ఐదుగురు గాయపడ్డారు. దీంతో వీరిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అత్యంత భద్రత నడుమ ఉండే ప్రధాని ముస్తఫా నివాసంపై తెల్లవారుజామున డ్రోన్ దాడి చేశారు దుండగులు. డ్రోన్ దాడితో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని ముస్తఫాను సురక్షిత ప్రాంతానికి తరలించింది. అత్యంత భద్రత నడుమ గ్రీన్ జోన్లో ఉండే ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి జరగడంపై ఇరాక్ ఆర్మీ అలర్టయింది. దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ ప్రకటన చేయలేదు. తాను క్షేమంగా ఉన్నాట్లు చెప్పారు ఇరాక్ ప్రధాని ముస్తఫా. దేశ ప్రజలంతా శాంతియుతంగా, సంయమనంతో ఉండాలన్నారు.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







