ప్రపంచాన్ని ఊపేసిన ‘స్క్విడ్‌గేమ్’ ఇప్పుడు తెలుగులో
- November 18, 2021
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ చేస్తున్న ‘స్క్విడ్‌గేమ్’ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ గా ‘స్క్విడ్ గేమ్’ చరిత్రకెక్కింది. ఈ సిరిస్ ద్వారా నెట్ ఫ్లిక్స్ భారీగా ఖతాదార్లని దక్కించుకున్నట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మరింతగా జనానికి చేరువ చేసేందుకు ‘స్క్విడ్‌గేమ్’ సిరీస్ ను స్థానిక భాషల్లోనూ విడుదల చేసేందుకు సిద్ధమయింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. అందులో మొదటగా తమిళ, తెలుగు ఆడియోను జతచేయబోతున్నారు. తెలుగులో స్ట్రీమ్ చేసేందుకు ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాల్ని కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.
తెలుగు వెర్షన్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ సిరీస్ చాలా ఆసక్తికరమైన పాయింట్ తో తెరకెక్కింది. ఇందులో కొన్ని గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. అందులో ఓడిపోతే చనిపోవడమే. అందులో గెలిచిన వారికి కోట్లు ఇస్తామంటూ కొందరిని బలవంతంగా ఆడిస్తుంటారు. ఇంతకీ ఆ గేమ్స్ ఏంటి? వాటిని ఎలా ఆడాలి అనే విషయాలు తెలియాలంటే.. ‘స్క్విడ్‌గేమ్’ సిరీస్ చూడాల్సిందే. కొరియా భాషలో వచ్చిన ఈ సిరీస్ .. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







