భవన భద్రత మరియు ఫైర్ ప్రొటెక్షన్ కోసం ఇ-సర్వీసుని ప్రారంభించిన సివిల్ డిఫెన్స్
- December 03, 2021
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, నేషనల్ పోర్టల్ 'bahrain.bh' ద్వారా ఎప్పటికప్పుడు కొత్త సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తోంది. సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అలి ముహమ్మద్ అల్ హౌతి మాట్లాడుతూ, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సూచనల మేరకు ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ సహకారంతో ఇ-సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. భవనాలకు సంబంధించి భద్రత అలాగే ఫైర్ ప్రొటెక్షన్ మరియు ప్రివెన్షన్ నిమిత్తం ఇ-సేవను అందుబాటులోకి తెచ్చారు. సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకోవడం, పరిశీలించడం, చెల్లుబాటుని తెలుసుకోవడం వంటివి లబ్దిదారులకు సులభతరమవుతుంది ఈ కొత్త విధానం ద్వారా. సర్టిఫికెట్ విషయమై సంబంధిత అథారిటీ వున్న వ్యక్తి తన వివరాల్ని పొందుపరిచి, లైసెన్సు నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవడానిక వీలుంటుంది. అవసరమైన పేమెంట్ చేయడం, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సి వుంటుంది. ఇ-గవర్నమెంట్ సర్వీసుల విషయమై మరింత సమాచారం కోసం 80008001 నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







