బాలయ్య 100వ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
- March 23, 2016
నందమూరి నటసింహం బాలకృష్ణ తన నెక్ట్స్ సినిమాతో 100వ మైలురాయిని అందుకోబోతున్నారు. అందుకే ఈ సినిమా ఎంపిక విషయంలో బాలయ్య స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండాలని భావించిన ఆయన చివరకు హిస్టారికల్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు.
కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా బాలయ్య 100వ సినిమా ఉండబోతోంది. ఇటీవల తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న బాలయ్య అక్కడకు వచ్చిన అతిథులు, సన్నిహితులతో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.ఈ వేడుకలో బాలయ్య స్టైలిష్ మీసంతో కనిపించారు. ఈ ఇది చూసి చాలా మంది 100వ సినిమా కోసమేనా? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. అవును, ఈ మీసం పెంచేది 100వ సినిమా కోసమే, క్రిష్ దర్శకత్వం వహిస్తారు. గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం.
అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహన రాజు గౌతమి పుత్రశాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కే ఈచిత్రం అందరినీ అలరించే విధంగా ఉంటుంది, ఆస్కార్ అవార్డు సైతం దక్కించునే రేంజిలో ఉంటుంది అని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. మరి బాలయ్య ఇంత నమ్మకంగా చెప్పడంతో అభిమనుల్లో 100వ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







