గూగుల్ వాయిస్ ద్వారా ఉచితంగా ఫోన్‌కాల్స్
- March 23, 2016
బెల్జియం, టర్కీ దేశాల్లోని ప్రజలకు హాంగ్‌అవుట్, హాంగ్‌అవుట్ డయలర్, గూగుల్ వాయిస్ ద్వారా ఉచితంగా ఫోన్‌కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ బుధవారం ప్రకటించింది. మొబైల్ నెట్‌వర్క్‌లతో పాటు.. ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్లకు కూడా ఉచిత కాలింగ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.
బ్రస్సెల్స్ దాడులు బాధాకరమని.. ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు గూగుల్ సంతాపం ప్రకటించింది.బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం ఉగ్రదాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 35 మంది మృతిచెందగా.. 200మందికి పైగా గాయపడ్డారు. ఘటన అనంతరం సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్ సేఫ్టీ చెక్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







