ఒమన్‌లో ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్స్‌కి అటెస్టేషన్‌ తప్పనిసరి

- March 23, 2016 , by Maagulf
ఒమన్‌లో ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్స్‌కి అటెస్టేషన్‌ తప్పనిసరి

అన్ని రకాలైన ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్లకూ మినిస్ట్రీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా అటెస్టేషన్‌ తప్పనిసరి. ప్రైవేట్‌ లేదా పబ్లిక్‌ సెక్టార్‌లో ఉద్యోగాల కోసం అటెస్టేషన్‌ తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వర్గాలు వెల్లడించాయి. ఒమన్‌లో పనిచేస్తున్న వలసదారులకు, అలాగే విదేశాల నుంచి సర్టిఫికెట్లు పొందిన ఒమనీయులకూ ఇది వర్తిస్తుంది. ఉద్యోగాలను కల్పించే ముందు కొన్ని కంపెనీలో సర్టిఫికెట్లను మినిస్ట్రీకి రిఫర్‌ చేయడంలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ సహకారంతో మినిస్ట్రీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ జరిపిన తనిఖీల్లో 1117 ఫేక్‌ స్టాంప్స్‌తో కూడిన సర్టిఫికెట్‌స, 133 ఫేక్‌ క్వాలిఫికేషన్‌ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఫేక్‌ సర్టిపికెట్లు కలిగినవారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆమోదం పొందిన యూనివర్సిటీలలోనే ప్రవేశం పొందాల్సిందిగా ఒమనీ స్టూడెంట్స్‌కి ఒమన్‌ ప్రభుత్వం సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com