'ఇండియా టుడే' కవర్ పై బాలయ్య.
- March 23, 2016
బాలకృష్ణ... ఈ పేరు వినగానే అందరికీ ఫ్యాక్షన్, యాక్షన్ ఈ రెండు గుర్తుకు వస్తాయి. ఈ నందమూరి అందగాడు ఎన్నో అందమైన పాత్రలతో ప్రేక్షకులని ఆకటుకుని, చాలా మందిని అభిమానులను సంపాదించుకున్నారు.
అంతేనా...కుర్రహీరోలతో సైతం పోటీపడుతూ తన సత్తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే వున్నారు. అయితే ఈ హిందుపురం ఎమ్.ఎల్.ఎ ..తన చిలిపి సంబాషణలతోనే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు.
తనకు పదవి ఇస్తానన్నా వద్దని గౌరవంగా, తనకు సినిమా లేకపోతే తాను లేనని ఘనంగా చాటుకున్న వ్యక్తి.
అలా అని తన నియోజకవర్గాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే, వారికి అందే పధకాలు సక్రమంగా అందుతున్నాయో లేవో కూడా దగ్గరుండి మరీ చుసుకుంటూ, తన కత్తికి రెండు వైపులా పదునుందని నిరూపించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.
ఇప్పుడు మరో గౌరవం దక్కనుంది బాలకృష్ణకి. ఇండియా టూడే కవర్ ఫోటోగా లెజెండరీ ఫోస్టర్ వచ్చి చేరింది. దీనిని ఏ.పి. సిఎమ్. ఎన్. చంద్రబాబు నాయుడు 3 గంటలకు సచివాలయంలో విడుదల చేయనున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ మీరు ను ఇక్కడ మీరు చూడవచ్చు.
ఈ రోజు విడుదల చేయనున్న స్పెషల్ ఎడిషన్ తాలూకు ఫ్రంట్ పేజ్ పై బాలయ్య లెజెండ్ సినిమాలోని లుక్ ను ముద్రించి 'ది లెజెండ్' అన్న టైటిల్ కూడా పెట్టారు. అంతేగాక దీనిపై ' తన తరం హీరోల్లో ఏకైక ఆల్ రౌండర్.. తండ్రికి తగ్గ తనయుడిగా సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న అనితరసాధ్యుడు' అన్న క్యాప్షన్లు కూడా ఉన్నాయి.
ఈ పుస్తకంలో బాలకృష్ణ సినీ, రాజకీయ జీవిత విశేషాలను ప్రస్తావిస్తారని తెలుస్తోంది. తమ హీరో ఇంత అరుదైన గౌరవం దక్కించుకోవడంతో నందమూరి అభిమానులు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







