భారత్ లో దుబాయ్ బడా వ్యాపారి పెట్టుబడులు..ఏకంగా 5వేల మందికి ఉపాధి
- December 12, 2021
యూఏఈ: యూఏఈకి చెందిన రిటైల్ దిగ్గజం లులు గ్రూపు గుజరాత్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఏకంగా రూ.2వేల కోట్లతో మాడ్రన్ షాపింగ్ మాల్ తెరిచేందుకు రెడీ అవుతుంది. దీని ద్వారా సుమారు 5వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ మేరకు శనివారం ఆ సంస్థ ప్రతినిధులు కీలక ప్రకటన చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దుబాయ్‌లో ఎన్నారై వ్యాపారవేత్త, లులు గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసఫ్ అలీను కలిసిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 2022 జనవరిలో జరగనున్న 'వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్'పై ప్రచారంలో భాగంగా ప్రస్తుతం సీఎం నాయకత్వంలో గుజరాత్ ప్రతినిధుల బృందంలో యూఏఈలో పర్యటిస్తుంది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు గట్టి పునాది వేయాలని గుజరాత్ భావిస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా లులు గ్రూపుతో ఈ భారీ ఒప్పందం కుదిరింది.
ఈ ప్రాజెక్ట్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్(ఎఓయూ)పై గుజరాత్ ప్రభుత్వం తరపున అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా. రాజీవ్ కుమార్ గుప్తా, యూసుఫ్ అలీ సంతకం చేశారు. ఎంఓయూ ప్రకారం లులు గ్రూప్ అహ్మదాబాద్, గాంధీనగర్ మధ్య ప్రపంచ స్థాయి షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 5వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2022 మొదటి త్రైమాసికంలో నిర్మాణాన్ని ప్రారంభించి 30 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఒక షాపింగ్ మాల్తో పాటు లులు గ్రూప్ వరుసగా బరోడా, సూరత్‌లలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనుంది.
“గుజరాత్లో పెట్టుబడులు పెడతానని అలీ చేసిన వాగ్దానాన్ని స్వాగతిస్తున్నాను. భూమి, ఏదైనా ఇతర సహాయం అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. తద్వారా వారు పని ప్రారంభించవచ్చు." అని సీఎం పటేల్ అన్నారు. ‘‘నా హృదయంలో గుజరాత్‌కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. మా నాన్నకు అహ్మదాబాద్‌లో కుటుంబ వ్యాపారం ఉన్నందున నేను బిజినెస్ బెసిక్స్ ఇక్కడే నేర్చుకున్నాను. కాబట్టి గుజరాత్లో పెట్టుబడులు పెట్టడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ శక్తివంతమైన రాష్ట్రంలో మనం మరింత విస్తరించగలమని ఆశిస్తున్నాను” అని యూసుఫ్ అలీ అన్నారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు









