నేడు ప్రారంభం కానున్న అల్ ఖోర్ మాల్ మల్టీప్లెక్స్
- March 23, 2016
లులు గ్రూప్ అల్ ఖోర్ మార్కెట్ వద్ద మూడు తెరల మల్టీప్లెక్స్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. కతర్ బహరేన్ సినిమా కంపెనీ ప్రకారం, దోహా వెలుపల ఇది మొదటి సాధారణ సినిమాహాలు . బుధవారం ఒక కంపెనీ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం, మూడు తెరలు కలిసి 500 పైగా ప్రేక్షకులు కూర్చొని వీక్షించే అవకాశం ఉందని అన్నారు. గతంలో మూడు తెరలకు కలిపి కేవలం 277 మంది మాత్రమె కూర్చేనే వీలు ఉండేది. మిగిలిన రెండు తెరలకు వరుసగా 146, 82 సీట్లు కల్గి ఉన్నాయి.
అల్ ఖోర్ నివాసితులు సినిమా మందిరాలు పట్ల మంచి ప్రోత్సాహాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారని అయితే, తమ సంస్థ సినిమా మందిరాలు ప్రారంభంతో ఉత్తర పురపాలక పట్టణం యొక్క స్థానిక జనాభా దీర్ఘ కాల డిమాండ్ నెరవేర్చామని కంపనీ అధికారి పేర్కొన్నారు.
ఇక్కడ ప్రారంభ సినిమాగా బాట్మాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ ( త్రీ డి మరియు సాధారణ రెండు) మరియు బాలీవుడ్ చిత్రం రాకీ హ్యాండ్సమ్ మూడు తెరల మల్టీప్లెక్స్ వద్ద చూపబడుతుందాని ఆ అధికారి తెలిపారు. రాకీ హ్యాండ్సమ్ సినిమా మధ్యాహ్నం 12 : 30 గంటలకు, సాయంత్రం 3 :15 గంటలకు, 6 గంటలకు, రాత్రి 8 :45 గంటలకు 11: 30 చూపబడుతుంది.
అలాగే బాట్మాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ త్రీ డి సినిమా ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 8 గంటలకు 11 గంటలకు ప్రదర్శించబడుతుంది
సాధారణ సినిమా మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు 12 అర్ధరాత్రి వరకు ప్రదర్శించనున్నారు. కాగా నేడు ( గురువారం ) ఉదయం 10 గంటలకు క్లుప్తమైన ప్రారంభోత్సవ వేడుక నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







