అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్ఆర్ఐ కొడుకు దుర్మరణం..

- December 21, 2021 , by Maagulf
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్ఆర్ఐ కొడుకు దుర్మరణం..

అమెరికా: అమెరికాలో మద్యం మత్తులో కారు నడిపిన ఓ మహిళ ఎఆర్ఐ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. లాస్ఏంజెల్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఎన్ఆర్ఐ కొడుకు మృతిచెందగా, కూతురు మృత్యువుతో పోరాడుతుంది. ఎన్ఆర్ఐ దంపతులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడేనికి చెందిన ఎన్నారై కొడుకు మృతిచెందగా, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. బండ్లగూడేనికి చెందిన ఎన్నారై చెట్టుపెల్లి రాంచంద్రారెడ్డి ఉద్యోగరీత్యా కుటుంబంతో లాస్‌ఏంజిల్స్‌లో నివసిస్తున్నారు. రాంచంద్రారెడ్డి పదహారేళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిగా స్థిరపడ్డారు.

ఆదివారం రాత్రి తన స్నేహితుడి జన్మదిన వేడుకలకు భార్య రజనీరెడ్డి, పిల్లలతో కలిసి కారులో వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తూ లాస్‌ఏంజిల్స్‌లోని ఓ కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కారును ఆపారు. ఈ క్రమంలో ఓ మహిళ మద్యం మత్తులో కారు డ్రైవింగ్‌ చేస్తూ.. వారి కారును అతివేగంగా వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెనుక సీట్లో కూర్చున్న కుమారుడు అర్జిత్‌రెడ్డి (13) దుర్మరణం చెందగా.. రామచంద్రారెడ్డి, రజనీరెడ్డి, అక్షితారెడ్డి (15) చికిత్స పొందుతున్నారని బంధువులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే బండ్లగూడెం గ్రామంలో విషాదం అలుముకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com