బిగ్ బాస్ షోలో అందరూ విజేతలే: షణ్ముఖ్ జస్వంత్
- December 25, 2021
విశాఖపట్నం: బిగ్ బాస్ షోలో పాల్గొన్న అందరూ విజేతలేనని, ఈ విషయంలో ఒకరు ఎక్కువ. ఒకరు తక్కువ కాదని రన్నర్గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ అన్నారు.శనివారం సాయంత్రం థాంక్యూమీట్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో షణ్ముఖ్ పాల్గొని మాట్లాడారు. ఆంధ్రా, తెలంగాణాతో పాటు అన్ని ప్రాంతాల అభిమానులు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. అందువల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. ఒక యూట్యూబర్ని ఈ స్థాయిలో నిలిపిన ఘనత మీ అందరిదేనన్నారు. తనకు వేసిన ఓట్లు ఎక్కడికి పోలేదని అవన్నీ తన గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నారు. ప్రస్తుతం తాను విమర్శల జోలికి పోబోనన్నారు. తన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఎటువంటి కామెంట్లు చేయవద్దని హితవు పలికారు. తాను ఈ స్థాయిలో గుర్తింపు పొందగలిగానంటే అందుకు బిగ్బాస్ ప్రధాన కారణంగా నిలుస్తుందన్నారు. అయితే భవిష్యతకు సంబంధించి తనకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రణాళికలు లేవని నెల రోజుల్లో కార్యాచరణ రూపొందించుకొని తిరిగి తన అభిమానుల ముంగిటకు వస్తానన్నారు. యూట్యూబ్బు కు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్ లు పెండింగ్లో ఉన్నాయని అవి పూర్తి చేస్తానన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం తనకు ఎంతో ఉత్సాహం కలిగించిందని, వారి మద్దతు వల్లే సుమారు 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో సమర్థవంతంగా రాణించగలిగానన్నారు. తనకు ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు చెప్పారు. అదే విధంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసిన, ఎవరు ఏదిరాసినా తాను తన దీపును త్వరలో కలుసుకోవడం ఖాయమన్నారు. తనకు వైజాగ్లో ఈ స్థాయి ఆదరణ లభించినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా హాజరైన సినీనటుడు ప్రసన్నకుమార్, సింహాచలం దేవస్థానం ప్రతె త్యేక ఆహ్వానితులు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబులు ఘనంగా సత్కరించారు. షణ్ముఖ్ తండ్రి కాండ్రేగుల అప్పారావు, రేస్ ఈవెంట్స్ అధినేత దాడిరవికుమార్లు తొలుత షణ్ముఖు సంబంధించిన వివరాలను తెలియజేశారు.వ్యాఖ్యాతగా హారిక వ్యవహరించారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







