'మై మొబైల్ ఐడీ' యాప్‌లో క్వారంటైన్ స్టేటస్‌ జత చేసిన పిఎసిఐ

- December 28, 2021 , by Maagulf
\'మై మొబైల్ ఐడీ\' యాప్‌లో క్వారంటైన్ స్టేటస్‌ జత చేసిన పిఎసిఐ

కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, హోం క్వారంటైన్ స్టేటస్ చూపించేలా మై మొబైల్ ఐడీ యాప్‌లో ఏర్పాట్లు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌తో కలిసి సంయుక్తంగా ఈ కొత్త ఫీచర్‌ని జోడించారు. కోవిడ్ 19 వ్యాక్సినేషన్, 48 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్, 10 రోజులపాటు హోం క్వారంటైన్, దేశంలోకి చేరుకున్నాక 72 గంటల తర్వాత పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ వంటివి తప్నిసరి చేయాల్సిందిగా క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకున్న దరిమిలా, కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com