ఏపీ సీఎం జగన్ ని కలిసిన కిడాంబి శ్రీకాంత్
- December 29, 2021
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు కిడాంబి శ్రీకాంత్.ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని శ్రీకాంత్ సాధించారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు సీఎం వైఎస్ జగన్.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు శ్రీకాంత్. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శాప్ ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి