జనవరి 1 నుంచి భారత్-సౌదీ మధ్య నేరుగా విమానాలు పునఃప్రారంభం

- December 30, 2021 , by Maagulf
జనవరి 1 నుంచి భారత్-సౌదీ మధ్య నేరుగా విమానాలు పునఃప్రారంభం

సౌదీ అరేబియా: భారత్‌ నుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి శుభవార్త. విమానాల రాకపోకలు కొనసాగించడానికి భారత్‌, సౌదీ ప్రభుత్వాలు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని అనుసరించి జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య ప్యాసింజర్‌ విమానాలు తిరగనున్నా యి.

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ప్రస్తుతం సౌదీకి నేరుగా విమానాలు లేవు. ఇతర గల్ఫ్‌ దేశాలకు వెళ్లి, అక్క డ నుంచి సౌదీకి చేరుకుంటున్నారు. సౌదీ నుంచి భారత్‌కు రావాలన్నా ఇదే పరిస్థితి. తాజా ఒప్పందంతో 1 నుంచి నేరుగా సౌదీకి వెళ్లడం వీలవుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com